చిరంజీవికి శోభారాణి షాక్: చంద్రబాబునాయుడు దీక్షకు సంఘీభావం

గత కొంతకాలంగా చిరంజీవి తెలుగుదేశం పార్టీనే లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజా అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వాన్ని వెనకేసుకు వచ్చినట్లు మాట్లాడుతూ నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబును సైతం దుయ్యబట్టారు. అధికారం కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. ఆ విషయం ఆయనే చెప్పారంటూ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు. ఓ వైపు చిరంజీవి అధికార పక్షం కన్నా అధికారంలో లేని ప్రతిపక్ష తెదేపానే ఆయన ఎక్కువగా విమర్శిస్తుండగా, శోభారాణి మాత్రం చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించి చిరంజీవిని షాక్ కు గురి చేసింది.
చిరంజీవికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఆమెకు ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన మహిళా సమావేశాన్ని ఆమె బహిష్కరించారు. పార్టీలో సామాజిక న్యాయం పాటించడం లేని ఆమె సమావేశాన్ని బహిష్కరించారు. మరోసారి మహిళలకు ప్రాధాన్యం లేదంటూ కూడా పార్టీని ఎదిరించింది. ప్రజారాజ్యం పార్టీలో మహిళలకు ప్రధాన్యం లేదని బహిరంగంగానే విమర్శించారు.












Click it and Unblock the Notifications