ఓయు విసిగా మాజీ డిజిపి స్వరణ్ జిత్: తిరుపతిరావు రాజీనామా?

Swaranjith Sen
హైదరాబాద్: తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఇప్పడున్న ఉపకులపతులను తొలగించి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు ఉపకులపతులుగా బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్న తిరుపతిరావు రాజీనామా చేయనున్నట్లు వస్తున్న వార్తలు వాటిని బలపరుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిణామాలపై ఆవేదన చెందిన తిరుపతిరావు తాను రాజీనామా చేయటం కానీ, లేదా దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విశ్వవిద్యాలయ అధికారులు మాత్రం వారిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆదివారం గవర్నర్ నరసింహన్ విసి తిరుపతిరావుతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయమంటే వేస్తారా, వారి భవిష్యత్తుపై ఉపకులపతిగా నీకు ఆలోచన లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలకు మనస్తాపం చెందిన విసి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం మలిదశలో తీవ్ర రూపం దాల్చింది ఉస్మానియాలోనే కావటం గమనార్హం. ఉద్రిక్త విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న వీసీలను పక్కన బెట్టి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను నియమించే అవకాశముందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+