సరిగ్గా మూడురోజుల్లో మళ్లీ ఊపందుకోనున్న నైరుతి రుతుపవనాలు.. అప్పుడు వద్దన్నా వర్షాలు!

తెలంగాణ ప్రజలు గత కొన్ని రోజులుగా తీవ్రమైన వడగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న వేళ వారికి ఊరట కలిగించే ముఖ్యమైన వార్తను భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మందగించిన నైరుతి రుతుపవనాలు తిరిగి ఊపందుకుని జూన్ 23వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా విస్తరించనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇందువల్ల జూన్ 21వ తేదీ ఆదివారం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రంలో ఊపందుకోనున్న రుతుపవనాలు

ప్రస్తుతం రుతుపవనాల ఉత్తర సరిహద్దు హైదరాబాద్, భద్రాచలం ప్రాంతాల చుట్టుపక్కల నిలిచిపోయి ఉంది. కానీ వాతావరణంలో ఏర్పడిన అనుకూల మార్పుల వల్ల రాబోయే నాలుగు-ఐదు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోకి వేగంగా ప్రవేశించనున్నాయి. దీంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకోనున్నారు.

IMD has given good news to Telangana people Southwest Monsoon is set to revive from June 23

జూన్ 19 నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ 19 నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయి. పొడి గాలుల స్థానంలో సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన చల్లని గాలులు వీచే అవకాశం ఉంది. ఇది వర్షాకాలం స్థిరపడటానికి దోహదపడుతుంది. జూన్ 17 నుంచి 20 వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జూన్ 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర వర్షాలు

అయితే జూన్ 21 నుంచి పరిస్థితి పూర్తిగా మారి రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరమైన వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో కొన్ని సార్లు 60 కి.మీ. వరకు బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

సాగు పనులు మొదలు పెట్టే రైతులకు శుభవార్త

ఖరీఫ్ సాగు పనులు చేపట్టాలని ఎదురుచూస్తున్న రైతులకు ఈ వార్త బలమైన ఉత్సాహాన్ని కలిగించింది. వర్షాలు సకాలంలో కురవడం ద్వారా పంటలు మంచి దిగుబడినిస్తాయని ఆశిస్తున్నారు. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా రుతుపవనాలు ముందుకు సాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మాన్సూన్ పునరాగమనం తెలంగాణ వ్యవసాయం, నీటి సంక్షోభం, విద్యుత్ ఉత్పాదన వంటి అనేక రంగాలపై సానుకూల ప్రభావం చూపించనుంది.

రాజీవ్ యువవికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త!
రాజీవ్ యువవికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త!

వర్షాల విషయంలో జాగ్రత్త

అయితే వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలలోనూ, రోడ్డు జామ్ వంటి సమస్యలు ఏర్పడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది మాన్సూన్ సకాలంలో ఊపందుకోవడం తెలంగాణ ప్రజలందరికీ ఉపశమనం కలిగించే అంశంగా మారుతోంది. వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలను గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+