ముదిరిన సరిహద్దు యుద్ధం: డ్రోన్ల వర్షంతో ఐసిస్ స్థావరాలు ధ్వంసం!

గత కొన్ని రోజులుగా తమ దేశంపై పాకిస్థాన్ జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ భూభాగంపై ఆఫ్ఘన్ సైన్యం భారీ ఎత్తున ప్రతీకార దాడులకు దిగింది. పాక్ భూభాగంలోకి డ్రోన్లను పంపి శత్రుస్థావరాలపై విరుచుకుపడింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఉన్న ఐసీసీ ఉగ్రవాద స్థావరాలను ఈ డ్రోన్ దాడులు పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారికంగా ప్రకటించింది. శత్రుదేశాల ఇంటెలిజెన్స్ గ్రూపుల సహాయంతో ఈ స్థావరాల నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు వ్యతిరేకంగా దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తమకు పక్కా సమాచారం ఉందని తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన పలు ఘోర ఉగ్ర దాడులకు ఈ ప్రాంతాలే ఆపరేషనల్ బేస్‌లుగా పనిచేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ స్పష్టం చేసింది.

నిజానికి గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులపై నిరంతరం దాడులు చేస్తోంది. గత వారం పాకిస్తాన్ సైన్యం 'ఆపరేషన్ గజబ్ లిల్-హక్' పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్, పక్తియా ప్రాంతాలతో పాటు కాబూల్, కాందహార్‌లపై భీకర వైమానిక దాడులు చేసింది. టీటీపీ (TTP), ఐసిస్-కే (ISIS-K) స్థావరాలే లక్ష్యంగా పాక్ ఈ దాడులు చేసినట్లు చెప్పినప్పటికీ.. ఈ దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో పలువురు అమాయక పిల్లలు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని ముందే హెచ్చరించింది. అన్నట్లుగానే, ఇప్పుడు పాక్ భూభాగంలోకి డ్రోన్లను పంపి ఉగ్రవాద స్థావరాలలో కోలాహలం సృష్టించింది.

Afghanistan-Pakistan Border Crisis Taliban Launches Deadly Drone Strikes Along the Durand Line

ఇదిలా ఉండగా.. ఈ రెండు దేశాల మధ్య డ్యూరాండ్ లైన్ సరిహద్దు వద్ద గత అక్టోబర్ 2025 నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ జరిపిన తొలి బాంబు దాడులకు సమాధానంగా, ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు భారీ ఎత్తున భూతల దాడికి దిగి, డ్యురాండ్ లైన్ వెంబడి ఉన్న పలు పాకిస్తానీ సరిహద్దు అవుట్‌పోస్టులను, సైనిక స్థావరాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత పాకిస్తాన్ మరింత రెచ్చిపోయి పక్తియాలోని తాలిబాన్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని, నంగర్‌హార్‌లోని ఆయుధ డిపోలను వైమానిక దాడుల ద్వారా ధ్వంసం చేసింది.

ఈ ఇరు దేశాల భీకర వైమానిక, భూతల దాడుల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో పెను విధ్వంసం జరిగింది. ఐరాస నివేదిక ప్రకారం, ఈ యుద్ధ వాతావరణం వల్ల తూర్పు ప్రాంతాల నుంచి 94,000 మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లవలసి వచ్చింది. అనేక ఆరోగ్య కేంద్రాలు, మతపరమైన కట్టడాలు, మానవతా సహాయక శిబిరాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్తతలను తగ్గించి, కాల్పుల విరమణ కోసం టర్కీ, రష్యా, చైనా వంటి దేశాలు రాయబార చర్చలు జరిపేందుకు ముందుకు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+