ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?
ఓటీటీ పుణ్యమా అని ప్రేక్షకులు అనేక రకాల సినిమాలను ఆస్వాధిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలను ఇంట్లోనే కూర్చుని చూస్తున్నారు. అలాగే థియేటర్లలో చూడలేని అనేక సినిమాలను ఇప్పుడు ఇంట్లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వేదికగా చూస్తున్నారు. థియేటర్లలో అంతగా ఆశించిన విజయం సాధించని సినిమాలు కూడా ఓటీటీ ప్రేక్షకులను ఇప్పుడు అలరిస్తున్నాయి. అయితే తమిళ నటుడు విష్ణు విశాల్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన మూవీ 'గట్టా కుస్తీ 2'(మట్టి కుస్తీ) థియేటర్లలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
థియేటర్లలో మంచి స్పందన రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తోంది. స్పోర్ట్స్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఇక ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను దక్కించుకుంది. దాంతో ఈ సినిమాను జూలై 31 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

గట్టా కుస్తీ మూవీ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్ లో సీనియర్ నటి రమ్యకృష్ణ, ప్రముఖ కమెడియన్ యోగిబాబు, కరుణాకరన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ పార్ట్ మాదిరిగానే రెండో భాగం కూడా థియేటర్లలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. ఈ మూవీ తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. అలా వరల్డ్ వైడ్ గా గట్టా కుస్తీ మూవీ రూ. 50 కోట్లు రాబట్టింది. మరి థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications