IPL లో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై RCB అనూహ్య ప్రకటన..!!

IPL లో విరాట్ కొనసాగుతారా. లేక, ఇక గుడ్ బై చెప్పేస్తారా. వరుసగా రెండు సార్లు ఛాంపియన్ గా ఆర్సీబీని నిలబెట్టటంలో కోహ్లీ ది కీలక పాత్ర. దీంతో.. ఫాంలో ఉన్న సమయంలోనే విరాట్ ఇక ఐపీఎల్ కు ముగింపు పలుకుతారా అనే సందేహాలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. అదే విధంగా వచ్చే సీజన్ నిర్వహణ పైనా కొత్త ప్రతిపాదనలు చర్చకు వస్తున్నాయి. ఈ సమయంలోనే కోహ్లీ ఆడటం.. విరాట్ భవితవ్యం పైన ఆర్సీబీ అనూహ్య ప్రకటన చేసింది.

ఐపీఎల్ లో ఆర్సీబీ- కోహ్లీది విడదీయరాని అనుబంధం. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంఛైజీ నుంచి మొత్తం 19 సీజన్లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ ఆర్సీబీతో అనుబంధం ఏర్పరుచుకున్నారు. ఆర్సీబీని రెండుసార్లు విజేతగా నిలవడంలో అతడిదే కీలక పాత్ర. తాను జట్లు మారే ప్రణాళికలు లేవని, తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీతోనే ముగించాలనుకుంటున్నానని కోహ్లీ పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు. మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్‌ అనంతరం ఈ క్యాచ్ రిచెస్ట్ లీగ్‌కు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో విరాట్ రిటైర్‌మెంట్‌పై ఆర్సీబీ సీఈవో రాజేష్ మేనన్ కీలక వ్యాఖ్యలు చేశారు.' ఆర్సీబీ, కోహ్లీ ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటి వారు. అతడికి రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఒకవేళ కోహ్లీ క్రికెట్‌కు దూరమైనా సరే.. ఆర్సీబీలో భాగం కాకుండా ఉండటాన్ని మేం ఊహించలేమని వ్యాఖ్యానించారు. తప్పకుండా దీనికి తప్పకుండా పరిష్కారాన్ని ఆలోచన చేస్తామని చెప్పారు.

 తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ ఖరారు- రూట్, ముహూర్తం..!!
తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ ఖరారు- రూట్, ముహూర్తం..!!
royal-challengers-bengaluru-ceo-backed-kohli-to-continue-playing-at-rcb-for-the-next-four-years

మరో నాలుగేళ్లు కోహ్లీ ఆడే సామర్ధ్యం ఉంది

దీనికి కొనసాగింపుగా.. 'ఇప్పటికప్పుడు విరాట్ ఐపీఎల్‌ను వదిలిపెట్టడు. కోహ్లీ తన కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ, అతని ఫిట్‌నెస్, పట్టుదల ప్రభావంతో కనీసం మూడు లేదా నాలుగేళ్లు ఆడతాడు. ఇప్పటికీ పరుగుల దాహం తీరలేదు. ఇటీవల సీజన్‌లో కోహ్లీని చూస్తేఈ విషయం అర్థమవుతుంది' అని రాజేష్ పేర్కొన్నారు. కాగా.. ఐపీఎల్ 2026లో కోహ్లీ ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడు 165.84 స్ట్రైక్ రేట్‌తో 675 పరుగులు సాధించాడు. ఇది ఒకే సీజన్‌లో అతడి అత్యుత్తమ స్ట్రైక్ రేట్. ఇక ఫైనల్‌ మ్యాచ్ లో అజేయంగా 75 పరుగులు చేసి.. ఆర్సీబీకి వరుసగా రెండు టైటిళ్లను గెలుచుకుని చరిత్ర సృష్టించడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. దీంతో.. విరాట్ ఫ్యాన్స్ కు ఈ న్యూస్ మరింత జోష్ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+