సీమాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడానికే శ్రీకృష్ణ కమిటీ: కాకా

Venkataswamy
న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడానికే కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేసిందని సీడబ్ల్యూసీ సభ్యుడు జి.వెంకటస్వామి (కాకా) తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రాలో తెలంగాణ వ్యతిరేకత లేదని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో చల్లారిన వాతావరణం కనిపిస్తోందన్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తుందని చెప్పారు. 2011లో రాష్ట్రం ఏర్పడుతుందని, కచ్చితమైన తేదీ మాత్రం చెప్పలేనని పేర్కొన్నారు. శనివారం పార్టీ ప్లీనరీ తొలిరోజు సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.''తెలంగాణపై సోనియాగాంధీతో మాట్లాడతా. రాజకీయ తీర్మానంలో ఈ అంశం ఉండే వాతావరణం కనిపించలేదు. శనివారం తీర్మానాలపై జరిగిన చర్చలో కూడా మాట్లాడే అవకాశం రాలేదు'' అని అన్నారు. డిసెంబర్‌ 9 ముందు ఆంధ్రాలో ఎప్పుడైనా ఉద్యమం నడిచిందా అని ప్రశ్నించారు.డిసెంబర్‌ 9 ప్రకటనే తెలంగాణ వస్తుందన్న నమ్మకానికి ఆధారమన్నారు. హైకమాండ్‌ ఈసారి ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీరాలని, తనకు ఆ మేరకు విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆ స్థాయికి పోదల్చుకోలేదని కాకా అన్నారు. కేసీఆర్‌ను అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లి 46 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు ఇప్పించింది తానేనన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో బలగాలు మోహరిస్తుండొచ్చని చెప్పారు. వైయస్ జగన్‌ పార్టీ వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం ఉండదని కాకా స్పష్టం చేశారు. ఇది సముద్రమని, ఎన్నో పార్టీలు వచ్చిపోయాయని వ్యాఖ్యానించారు. ఒకసారి బయటికెళ్లిన తర్వాత తలాఖ్‌ ఇచ్చినట్లేనన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనకు వ్యక్తిగతంగా ఎంత నష్టం చేయాలో అంత చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు మంత్రి పదవి రాకుండా వైఎస్‌ అడ్డుకున్నా జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలనిసమర్థించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+