రాజకీయంగా రాష్ట్రం మునుపెన్నడూ లేనంత కుదుపునకు గురైంది. ఉద్యమాలతో అట్టుడుకింది. ముఖ్యమంత్రుల మార్పు అనివార్యంగా మారింది. రాజకీయంగా పైచేయి సాధించడానికి వివిధ పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు. క్రీడారంగంలో మన రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ లో సత్తా చాటారు. అన్ని రంగాల్లోనూ మనం మార్పును గమనించవచ్చు. ఈ స్థితిలో 2010 సంవత్సరంలో వివిధ రంగాల్లో ఆయా ప్రముఖులకు మీరు ఓటు చేయవచ్చు. ఇందుకు సంబంధించి వన్ ఇండియా తెలుగు ఓ పోల్ నిర్వహిస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్లో 2010 సంవత్సరంలో వారి పనితీరును బట్టి మీకు నచ్చినవారికి ఓటు చేయవచ్చు. ఈ ఓటింగ్ ఫలితాలను డిసెంబర్ 31వ తేదీన ప్రకటిస్తాం.