వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి హీరో రాజశేఖర్ దంపతులు

జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లడంతో వారు వైయస్ మీద అభిమానంతో జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నిత్యం ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవిని లక్ష్యంగా చేసుకొనే రాజశేఖర్ వైయస్ మృతి తర్వాత చిరంజీవికి దగ్గరవుతున్న కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని, మంత్రివర్గంలో చేరుతుందని పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ దగ్గరవుతుండటం, తమ అభిమాన రాజకీయ నాయకుడు వైయస్ తనయుడు జగన్ పార్టీ పెట్టడం ఈ నేపథ్యంలో వారు జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications