కెసిఆర్ ఎఫెక్ట్: సోనియా గాంధీకి తెలంగాణ నేతల మొర

జై తెలంగాణ కాంగ్రెసు నినాదమని సర్వే సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెసు తెలంగాణ నాయకులకు మొదటి నుంచీ ఇష్టం లేదని ఆయన అన్నారు. జై తెలంగాణ కొత్త నినాదం కాదని, మొదటి నుంచీ తాము ఆ నినాదం చేస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో తాను రాళ్లు పట్టుకున్నవాడినే అని ఆయన అన్నారు. కెసిఆర్ హెచ్చరికల వల్ల తాము జై తెలంగాణ నినాదం ఇస్తున్నామనడంలో నిజం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications