అవినీతికి కాంగ్రెసు ఎప్పుడూ వ్యతిరేకమే: ప్లీనరీలో ప్రధాని మన్మోహన్ సింగ్

దేశంలో కాంగ్రెసు పార్టీ బలంగా ఉంటేనే భారతదేశం స్థిరంగా ఉంటుందని మన్మోహన్ చెప్పారు. దేశాన్ని ముందుకు నడిపించగల సత్తా కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. కింది స్థాయి సామాన్య కార్యకర్తలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని ఆయన నాయకులకు సూచించారు. ప్రజల సంక్షేమమే మన లక్ష్యంగా పని చేయాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వము ఉన్నప్పటికీ అందరినీ సమానంగానే చూస్తున్నామని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం కొందరు పార్టీని బలహీనపరచాలని చూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications