మెజార్టీ లేకున్నా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తాం: నాగం

చంద్రబాబు దీక్ష విరమించాలంటున్న ప్రభుత్వం ఆయన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. రైతులు గుండె పగిలి చనిపోతున్నారన్నారు. ఇంటికి రావాల్సిన ధాన్యం నీళ్లలో మునిగి పోతుందన్నారు. రైతుల సర్వం కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ప్రధానమంత్రి వేసిన కమిటీ రిపోర్టు ప్రకారం ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం ఢిల్లీలో ఉందన్నారు. ముఖ్యమంత్రిని దించడానికి మాకు మెజారిటీ లేదన్నారు. అయినా రైతు వ్యతిరేక చర్యలను ఖండిస్తూ అవిశ్వాస తీర్మానానికి వెనుకాడేది లేదన్నారు.












Click it and Unblock the Notifications