చిరంజీవిపై చిందులేసిన హీరో రాజశేఖర్, సినీ నటి జీవిత

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిస్థితి చూస్తుంటే జాలేసిందన్నారు. వారు అక్కడ తమ తమ వ్యక్తిగత సమస్యలపై హడావుడిగా కనిపించేవారన్నారు. అలాంటి వారు రాష్ట్ర సమస్యలను ఏం పట్టించుకుంటారని వారు ప్రశ్నించారు. వైఎస్ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. జగన్ గెలిస్తే మళ్లీ రాష్ట్రంలో వైఎస్ పాలన వస్తుందన్నారు. వైఎస్ లాంటి చరిష్మా జగన్ కే ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జగన్ ను అణగదొక్కాలని చూసిందన్నారు. ఆయన ఓదార్పుకు ఆటంకం కలిగించారన్నారు. రాత్రింబవళ్లు కష్టపడిన వైఎస్ తనయుడు జగన్ పక్కన పెట్టడం సరికాదన్నారు. జగన్ ను పక్కన పెట్టడమే కాదు, వారి కుటుంబంలో చిచ్చు కూడా పెట్టారన్నారు.
విభజన వాదం పటిస్తున్న నాయకులు కేవలం పదవుల కోసమేనన్నారు. తెలంగాణ గురించి మాకు తెలియదన్నారు. అయితే రాష్ట్రం కలిసి ఉంటేనే బాగుంటుందనేది తమ అభిప్రాయమన్నారు. మేం ఎప్పుడు జగన్ వెంట, జగన్ వెంటే ఉంటామన్నారు. వైఎస్ చేయాలనకున్న సంక్షేప పథకాలను జగన్ పూర్తి చేస్తాడన్నారు. జగన్ ను విజయవాడలో కలుస్తామని చెప్పారు. మంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని కాంగ్రెస్ పై తమ నిరాశకు అదీ ఒక కారణమన్నారు. ఎన్నికల సమయంలో రాత్రింబవళ్లు పార్టీకోసం పని చేశామన్నారు.
తమకు ఓ కొత్త పార్టీతో గొడవలున్నాయని వారు పరోక్షంగా చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఉద్దేశించి అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని పార్టీ అనటం కంటే కంపెనీ అనటం సముచితమన్నారు. చిరంజీవిపై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని రాజకీయాల్లో ఉన్నందునే ఆయనను విమర్శిస్తున్నామన్నారు. చిరంజీవి చివరకు నానా బూతులు తిట్టిన కాంగ్రెస్ లోకే వెళుతున్నారన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ ఇరు పార్టీలు పరస్పరం విమర్శించుకున్న విషయం అందరికీ తెలిసిందన్నారు. ఇప్పుడు ఆ పార్టీలో ఒక్కటవుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications