పిఎసి ముందు హాజరు కావడానికి నేను రెడీ: ప్రధాని మన్మోహన్

Manmohan Singh
న్యూఢిల్లీ‌: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ముందు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. ఎఐసిసి 83వ ప్లీనరీ సమావేశంలో ఆయన సోమవారం ప్రసంగించారు. అవినీతిని ప్రభుత్వం గానీ కాంగ్రెసు పార్టీ గానీ ఏ మాత్రం సహించబోవని ఆయన చెప్పారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

పార్లమెంటు శీతాకాలం సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేయడాన్ని ఆయన తప్పు పట్టారు. సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ 2జి స్పెక్ట్రమ్ స్కామ్ పై న్యాయవిచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షం జెపిసికి డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ మాత్రమే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని ఆయన చెప్పారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. సోనియా వంటి నాయకురాలు ఉండడ దేశ ప్రజల అదృష్టమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+