వైయస్ జగన్ దీక్షపై దుమ్మెత్తిపోసిన మంత్రులు, కాంగ్రెసు నేతలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రైతులకు ప్రకటించిన ప్యాకేజీ చూసి వైఎస్ ఆత్మ సంతోషిస్తోందని, జగన్ తీరు పట్ల క్షోభిస్తుందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలపై ఆయన సీఎంతో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును చర్చలకు ఆహ్వానించడంలో ప్రభుత్వం ఏమాత్రం భేషజాలకు పోవడం లేదని స్పష్టం చేశారు. రైతులు మనోస్త్థెర్యాన్ని కోల్పోయే విధంగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సరిపోకపోయినా ఏ మేరకు స్పందించామో గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత మెరుగైన ప్యాకేజీ తీసుకొచ్చేందుకు అందరం యత్నిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications