ప్రభుత్వంపై వైయస్ జగన్ దీక్ష ప్రభావం: ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి

Mekapati Rajamohan Reddy
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 48 గంటల దీక్ష ప్రభావం ప్రభుత్వంపై ఉంటుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారం అన్నారు. చేనేత, జౌళీ శాఖమంత్రి శంకర్ రావు మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన నియోజకవర్గంలోని ప్రజల అభీష్టం మేరకే జగన్ వెంట వెళుతున్నానని చెప్పారు. అందుకే ఆయన దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

ఈ రెండు రోజులపాటు జగన్ చేపట్టిన నిహారాహార దీక్ష రాష్ట్రంలోని రైతులకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. నష్టపోయిన రైతులపై ప్రభుత్వం స్పందించనందునే వారికి సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేపట్టారన్నారు. ఈ దీక్ష ప్రభావం ప్రభుత్వంపై తప్పకుండా ఉంటుందన్నారు. ఈరోజు జగన్ కు మద్దతు పలికిన వారిలో మేకపాటితో పాటు దర్శి శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+