ఎఒబిలో పోలీసుల కుంబింగ్: ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి
National
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. మరో నక్సలైట్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా నిర్ధారించలేదు. కోరావుట్ జిల్లా నారాయణపట్నం సమీప ప్రాంతంలో పోలీసులు నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో కూంబింగ్ ప్రారంభించారు. అయితే కూంబింగ్ ప్రారంభం కాగానే అక్కడే పొంచి ఉన్న నక్సలైట్లు కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు చనిపోయారు.