అమెరికాలో తెలుగు విద్యార్థి జయచంద్ర కాల్చివేత

America
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన విజయవాడకు చెందిన తెలుగు విద్యార్థిని డబ్బుల కోసం నల్లజాతీయుడు కాల్చి చంపాడు. విజయవాడకు చెందిన నాగేశ్వరరావు కుమారుడు ఏలప్రోలు జయచంద్రను డబ్బుల కోసం నల్లజాతి వ్యక్తి దారుణంగా కాల్చి చంపాడు. ఇరవై రెండేళ్ల జయచంద్ర నాలుగు నెలల క్రితం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. సిద్దార్థ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్చి చేసి అమెరికాలోని హోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్ కోసం చేరారు. బయట రూమ్ తీసుకున్నాడు. ఓ పెట్రోల్ బంకులో పార్ట్ టైమ్ ఉద్యోగంలో చేరాడు. శుక్రవారం తన షిఫ్టు పూర్తయినప్పటికీ మరో ఉద్యోగి రాకపోవడంతో ఓవర్ టైమ్ చేశాడు.

శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం) ఒక నల్ల జాతీయుడు పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. తన వాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. అక్కడి నుంచి బాత్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు. ఒక్కసారిగా తుపాకీ తీసి జయచంద్రపై కాల్పులు జరిపాడు. అతని వద్ద ఉన్న క్యాష్ బ్యాగ్‌ను తీసుకుని పరారయ్యాడు. జయచంద్ర అక్కడికక్కడే మరణించాడు. ఆ నల్ల జాతీయుడు ప్రతిరోజూ అదే పెట్రోల్ బంక్‌కు వచ్చేవాడని తెలుస్తోంది. జయచంద్ర తండ్రి నాగేశ్వరరావు విజయవాడ సమీపంలోని హెచ్ఎంఈఎల్ ఉద్యోగి. తల్లి జయశ్రీ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పని చేస్తున్నారు. వీరికి జయచంద్ర ఒక్కడే కుమారుడు.

మరో కూతురు ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. జయచంద్ర శనివారం ఉదయమే విజయవాడలోని తన మిత్రులతో మాట్లాడాడు. క్షేమ సమాచారాన్ని పంచుకున్నాడు. తర్వాత కొన్ని గంటలకే అతను కన్నుమూశాడు. జయచంద్ర మరణించిన విషయాన్ని శనివారం అర్ధరాత్రి దాకా ఆయన తల్లిదండ్రులకు చెప్పలేదు. ప్రస్తుతం విజయవాడలోనే ఉన్న తానా అధ్యక్షుడు జయరాం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయచంద్ర మృతదేహాన్ని స్వదేశం తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+