సిఎం కిరణ్ భవిష్యత్తు త్వరలో తెలుస్తుంది, రోశయ్య కన్నా తక్కువే: గోనె

జగన్ కు మద్దతు పలక వద్దని కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ్యులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ వారు పాల్గొంటున్నారన్నారు. జగన్ ను విమర్శిస్తున్న వారికి ముందు ముందు సమాధానం లభిస్తుందన్నారు. జగన్ ఆస్తులపై గొడవ చేసేవారు ఆయన ఆస్తులపై సిబిఐ ఎంక్వయిరీ వేయించాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కంటే తక్కువ సమయమే పదవిలో ఉండే అవకాశముందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా తెలంగాణపై కాంగ్రెస్ వారికి నిబద్దత లేదన్నారు. వారు తమ స్వార్థం రాజకీయాల కోసం సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల మన్ననలు పొందాలని చూస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసమే ఇలాంటివి చేస్తుందని ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి అన్నారు. సిడ్లూసి పదవి పొందే వరకు కేకే ఎత్తుగడలు వేస్తారన్నారు. దీక్షలో కేకే, విహెచ్ లతో పాటు మంత్రి జైపాల్ రెడ్డి కూడా కూర్చోవాలన్నారు. పదవులు కోసం వారికి బ్లాక్ మెయిల్ చేయటం అలవాటన్నారు.












Click it and Unblock the Notifications