తెలంగాణలో జరిగినట్లు కాశ్మీర్ లో కూడా జరగలేదు: సమైక్యాంధ్ర జెఎసి

సిడబ్ల్యుసి సభ్యుడిగా ఉన్న కె. కేశవరావు హేతురహితమైన వాదనలు చేయడం సిగ్గు చేటని సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ కిశోర్ అన్నారు. తెలంగాణ జెఎసి ముసుగులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వ్యక్తులు విధ్వంసాలకు దిగారని ఆయన ఆరోపించారు. జెఎసి ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. తమకు సీమాంధ్ర రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభించని మాట వాస్తవమేనని ఆయన అన్నారు. తమతో కలిసి రావాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా రాకుండా కార్యాచరణకు దిగాలని తాము సీమాంధ్ర నాయకులకు అల్టిమేటం ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications