చవటలు, దద్దమ్మలుగా మిగలకండి: కాంగ్రెసు ఎంపిలకు కెసిఆర్ పిలువు

తెలంగాణ కాంగ్రెస్ నాయకులను చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అంటే రోషం వస్తోందని, ఒకసారి కాదు, పదిసార్లు అంటానని, వారికే సిగ్గు, లజ్జ ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. వందలాది మంది ఆత్మబలిదానాలు చేస్తే పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పందించలేదని, తెలంగాణ ఇచ్చేది సోనియా తెచ్చేది నేను అని ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలికి భూస్థాపితం అయ్యాడని, ఇంటికి తులం బంగారం పంచిపెట్టినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని ఆయన అన్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలంటే సీఎంకు లెక్కే లేకుండా పోయిందని, విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని వినతి పత్రం ఇస్తే చెత్తబుట్టలో వేశాడని ఆయన అన్నారు. 'ఎంపీల్లారా పట్టిన పట్టు విడవకండి. దిగిరాకపోతే రాజీనామాలు లేఖలు రాసి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సోనియాగాంధీ ముఖాల మీద విసిరికొట్టండి. మీరు పదవులకు రాజీనామాలు చేస్తే తెలంగాణ ప్రజల కాళ్లు మొక్కి మరీ మిమ్మల్ని గెలిపిస్తాం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంలేదు. ఇప్పటికే వూళ్లన్నీ ఉద్యమ వేదికల్లా మారాయి. ఇక ముందూ ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలి' అని కేసీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications