సొమ్ము మనది, షోకు వారిది: సీమాంధ్రులపై కెసిఆర్ ధ్వజం

Telangana
హైదరాబాద్: సొమ్ము మనది, షోకు వారిదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు తెలంగాణది మిగులు బడ్జెట్ అని, ఆంధ్ర రాష్ట్రానిది లోటు బడ్జెట్ అని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలను, నీళ్లను కొల్లగొట్టారని, 54 ఏళ్ల పాటు తెలంగాణను పీక్కు తిన్నారని ఆయన అన్నారు. తెరాస కార్యాలయం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం రాజీనామాలకు సిద్ధమని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా తనకు చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ధర్మం,న్యాయం మన వైపు ఉందని, అంతిమ విజయం ధర్మం, న్యాయాలదేనని, అయితే సమయం పడుతుందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కృష్ణాగోదావరి నదులు నీళ్లు దోచుకున్నారని, నిధులు కొల్లగొట్టారని,ఉద్యోగాలు కాకుండా చేశారని ఆయన అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ల్యాంకో హిల్స్ పేరు మీద ముస్లింల భూమిని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు దీక్ష చేసినా ప్రభుత్వం దిగి రాలేదని, తెలంగాణ పార్లమెంటు సభ్యులకే విలువ లేదని, ప్రజలకు ఏ మేరకు విలువ ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. తన దీక్ష వల్ల, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల ఒత్తిడి వల్ల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే సీమాంధ్ర నాయకులు జెండాలకు, పార్టీలకు అతీతంగా ఒక్కటై అడ్డుకున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+