తస్మాత్ జాగ్రత్త: సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి కెసిఆర్ హెచ్చరిక

K Chandrasekhar Rao
హైదరాబాద్: తస్మాత్ జాగ్రత్త అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఈ సాయంత్రంలోగా ఎత్తేయకపోతే తామంతా రోడ్ల మీదికి వస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదులోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులను ఆయన మంగళవారం సోమవారం పరామర్శించి, సంఘీభావం తెలిపారు. తమ పార్లమెంటు సభ్యుల ముఖాలు పీక్కుపోయాయని, వారి ముఖాలు పీక్కుపోతే తెలంగాణ ప్రజల ముఖాలు సూర్యుళ్లా వెలుగుతాయని, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుల దీక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తోందని ఆయన చెప్పారు. కేసులు ఎత్తేయకపోతే తాము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పే పార్లమెంటు సభ్యులు దీక్షకు దిగారని ఆయన చెప్పారు.

పార్లమెంటు సభ్యులు చెప్తే కూడా ముఖ్యమంత్రి వినకపోవడం దౌర్భాగ్యమని ఆయన అన్నారు. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ప్రాంత నాయకులు జెండాలను, పార్టీలను పక్కన పెట్టి పోరాటం చేస్తారని ఆయన చెప్పారు. దీక్ష చేస్తున్న పార్లమెంటు సభ్యుల వెనక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విడిపోవడానికి తగిన ప్రాతిపదిక ఉందని, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు షరతులు లేకుండా జరిగింది కాదని, శాశ్వతం కూడా కాదని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులను విభజించి, నెహ్రూలను మోసం చేసి తెలంగాణను విలీనం చేయించారని ఆయన విమర్సించారు. తెలంగాణను ఆంధ్రతో కలపడం నెహ్రూకు ఇష్టం లేదని, పొత్తు కుదరనప్పుడు విడిపోవచ్చునని కూడా నెహ్రూ అన్నారని, దార్శనికుడు కాబట్టే ప్రమాదాన్ని పసిగట్టారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+