నివేధిక వ్యతిరేకమైతే ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: సీమాంధ్ర ఐకాస

కమిటీ నివేదిక సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా వస్తే ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేయలని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను సీమాంధ్ర నుండి వెలివేస్తామని హెచ్చరించారు. కొందరు వేర్పాటు వాదులు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వారి బ్లాక్ మెయిలింగులకు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గకూడదని తీర్మానం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
సమైక్యాంధ్రకే సీమాంధ్ర ఐకాస కట్టుబడి ఉందని ఐకాస నాయకులు అంతకుముందు చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి తాము ఒప్పుకునేది లేదని చెప్పారు. తెలంగాణ నాయకులు రాజకీయ మనుగడ కోసం తెలంగాణ ఎత్తులు వేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు శాంతియుతంగా ఉద్యమాన్ని చేశామన్నారు. అయితే కమిటీ నివేదిక సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా వస్తే ఊరుకునేది లేదన్నారు. గ్రామగ్రామాన ఉద్యమాన్ని విస్తరింప జేస్తామన్నారు.












Click it and Unblock the Notifications