హైదరాబాద్: ఆశా వర్కర్లపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. సాటి ఆడవారని కూడా చూడకుండా వారిపై నిర్దాక్షిణ్యంగా లాఠీ ఛార్జ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు బుధవారం ఆందోళనకు దిగారు. అయితే ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించడానికి కలెక్టరేట్ ను ముట్టడించాలనుకున్నారు. ఆ సమయంలో వారు హోంమంత్రి సబితారెడ్డి కారును ఘెరావ్ చేయడానికి యత్నించారు. హోంమంత్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.వారు ఎంతకూ తగ్గక పోవడంతో మహిళా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జీలో పలువురు ఆశా వర్కర్లు గాయపడ్డారు.