వైయస్ జగన్ తో కె. చంద్రశేఖర రావు చేతులు కలుపుతారా?

K Chandrasekhar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేతులు కలుపుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. మధ్యంతర ఎన్నికలు తప్పవని, మధ్యంతరం వస్తే తెలంగాణలో తాము, సీమాంధ్రలో వైయస్ జగన్ క్లీన్ స్వీప్ చేస్తామని కెసిఆర్ ఆషామాషీగా అనలేదనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చడానికి వైయస్ జగన్, కెసిఆర్ వర్గాలు చాలా కాలంగా మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి గురువారం ఇద్దరు నేతల అనుచరుల మధ్య కీలకమైన చర్చలు జరిగినట్లు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక వ్యాఖ్యానించింది.

ఉమ్మడి శత్రువైన కాంగ్రెసును పడగొట్టడానికి చేతులు కలపడానికి ఒక మేరకు కెసిఆర్, జగన్ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోతే రెండు చోట్ల కూడా కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని, రాజకీయంగా తమకు ప్రయోజనం ఉండదని, రాజకీయ ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికలను ఆహ్వానించడమే మార్గమని కెసిఆర్ భావిస్తున్నారట. ఇదే విషయాన్ని వైయస్ జగన్ తో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం వైయస్ పై ప్రజల్లో ఉన్న అభిమానం వల్ల, వైయస్ జగన్ కు లభిస్తున్న ఆదరణ వల్ల సీమాంధ్రలో వైయస్ జగన్ అధిక సీట్లు సాధించుకుంటారని తెరాస నాయకుడొకరు వైయస్ జగన్ వర్గానికి నచ్చజెబుతున్నట్లు సమాచారం. తెలంగాణలో వైయస్ జగన్ అడుగు పెట్టలేరని, తాము సీమాంధ్రలోకి రాలేమని, అందువల్ల కలిసి పనిచేస్తే ఇరువురికి లాభం కలుగుతుందని వివరిస్తున్నట్లు తెలుస్తోంది.

మధ్యంతర ఎన్నికల తర్వాత రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో వైయస్ జగన్, ఇక్కడ తాము ఉంటామనేది కెసిఆర్ అనుచరులు అంటున్న మాటగా తెలుస్తోంది. అయితే, విడివిడిగా వ్యవహరిస్తూనే కలిసి పనిచేయాలనేది కెసిఆర్ అంతరంగమని చెబుతున్నారు. సమైక్యవాది అయిన వైయస్ జగన్ తో కలిసిపోయామనే అపవాదు రాకుండా ఈ పనిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ ప్రతిపాదనలు ఒక మేరకు వైయస్ జగన్ కు కూడా నచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+