• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హ్యాపీ బర్త్ డే వన్ ఇండియా డాట్ ఇన్: ఇప్పుడు ఐదేళ్ల యువతేజం

By Pratap
|

వన్ ఇండియా డాట్ ఇన్ 2006 జనవరి 1వ తేదీన తన కార్యకలాపాలను ప్రారంభించింది. 2010 సంవత్సరం మాకు అద్భుతమైంది. ఇప్పుడు మాది ఐదేళ్ల యువతేజం. నిబద్ధత గల పాఠకులు, అడ్వయిర్టయిజర్ల వల్లనే మేం ఈ స్థాయికి ఎదిగాం. వారికి మా కృతజ్ఞతలు.

మా సైట్ కు పేరు ఖరారు చేసుకోకుండానే మేం 2006 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించాం. వన్ ఇండియా డాట్ ఇన్ పేరును ఫిబ్రవరిలో ఖరారు చేసుకున్నాం. ఈ పేరును ప్రతి ఒక్కరూ అభిమానించారు, ఇప్పుడు కూడా అభిమానిస్తున్నారు.

టీమ్ కు అది ఉద్వేగభరితమైన దశ. ప్రారంభం ఎప్పడూ ఉద్వేగభరితమైంది, భయంతో కూడింది కూడా. కడుపులో సీతాకోకచిలుక ఎగురుతున్న భావనకు గురి కావడం సహజం. భారతదేశంలో 2006లో ఆన్ లైన్ అడ్వర్టయిజింగ్ రెవెన్యూ ప్రోత్సాహకరంగా లేదు. మేం అత్యంత విశిష్టమైన ఆవరణంలో ఉన్నాం - అది భారతీయ భాషలు. ఆ కాలంలో ప్రాంతీయ భాషల సైట్లకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చే సంప్రదాయానికి అడ్వర్టయిజర్లు అలవాటు పడిలేరు.

Oneindia

భారతీయ భాషల మద్దతుతో మేం మా ఆన్ లైన్ క్లాసిఫైడ్ సైట్ - క్లిక్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియకు మేమే శ్రీకారం చుట్టాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రారంభించాం. ఈ సేవలు భారతదేశంలో లాంగ్వేజ్ యూజర్స్ కు అవసరమనే మాకు గట్టిగా తెలుసు. తొలిదశలో మేం కొంత మంది యూరోపియన్లతో కలిసి పనిచేశాం. మాకు అది మంచి అనుభవాన్ని ఇచ్చింది.

ఇతర ఇంటర్నెట్ వెంచర్ల మాదిరిగానే మేం విసీల నుంచి నిధుల సమీకరణ దశను కూడా చూశాం. అయితే అది అంత సులభం కాదు. భారతీయ భాషల పట్ల మా ప్యాషన్ ను స్వీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇంటర్నెట్ లో భారతీయ భాషల ఆవరణం వాస్తవరూపం దాలుస్తుందనే నమ్మకం వారికి లేదు. నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. సొంతంగానే మేం ప్రయత్నాలను సాకారం చేసుకునే కృషితో ఫలితం సాధించాం. ముందుకు సాగినందుకు సహకరించిన డిపెండబుల్ టీమ్ కు కృతజ్ఞతలు.

ప్రజలపరంగా చూస్తే సంస్థల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. యువత పెళ్లిళ్లు చేసుకున్నారు (వారి పెళ్లి జరిగిన తొలి సంవత్సరంలో కార్యాలయంలో కొద్ది గంటలు మాత్రమే ఉండడం), యువతులు తల్లులు కావడం చూశాం (ఇంటికి సబంధించిన బాధ్యతలు మీద పడడం), కొంత మంది వారి 40 ఏళ్ల పడి దాటారు (హో, విచిత్రం).

మేం ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కున్నాం. ఆ సందర్భాల్లో ఎల్లవేళలా మేం కఠిన శ్రమ చేశాం. పనికి సంబంధించి చాలా సాధించాలని అనుకున్నాం, కానీ ఆర్థిక సమస్యలు. సంస్థలోని ప్రతి ఒక్కరికీ 2010 ప్రారంభంలో శుభవార్త అందింది. 2010 ఏప్రిల్ లో రాజేష్ జైన్ కు నెట్ కోర్ ను పొందాం. చాలా సానుకూల ధోరణితో నెట్ కోర్ యాజమాన్యం చాలా విషయాల్లో మాతో కలిసి పనిచేసింది. ఈ రెండు సంస్థల అనుబంధం సత్ఫలితాలు ఇచ్చింది.

2010 అక్టోబర్ లో మేం మా కార్యాలయం కొత్త భవనంలోకి మారింది. ఇక్కడ మంచి మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఇది మా సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది.

ఇంటర్నెట్ పెనట్రేషన్ గ్లాస్

వ్యాప్ స్పేస్ లోనూ, ఎస్ఎంఎస్ స్పేస్ లోనూ. ఒక వేళ భారతీయ భాషా ఫ్రంట్ సపోర్టు ఉంటే మొబైల్ పై ఇండిక్ చాలా తీసుకోవాల్సి ఉంటుంది. దురదృష్ణవశాత్తు కొన్ని ఫోన్లకు మాత్రమే ఇండిక్ సపోర్టు ఉంటుంది. బాధపడాల్సిందేమీ లేదు, ఇండిక్ ను సపోర్టు చేయని మొబైల్స్ కు కూడా మేం మద్దతిస్తున్నాం. మా ప్రొడక్టును2010 సెప్టెంబర్ లో న్యూస్ హంట్

భారతదేశంలో ఇండిక్ వాడకం

డిజిటల్ స్పేస్ ల భారతీయ భాషల (ఇండిక్) ప్రయోగం చేసిన పోర్టల్ మాది ఒక్కటే. మా క్రికెట్ స్కోర్ కార్డుల ఇండిక వెర్షన్స్ పాఠకుల్లో విశేష ఆదరణ పొందాయి. డిజిటల్ స్పేస్ లో ప్రతి ఆఫర్ ఇండిక్ లో ఉండాలనేది మా నమ్మకం.

ప్రజలు విజయాన్ని చూసినప్పుడు పోటీ వస్తోంనేది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని పెద్ద మీడియా సంస్థలు కూడా తమ ఇండిక్ ప్రణాళికలను ప్రకటించాయి. అత్యంత క్లిష్టమైన ఇండిక్ బ్యాంగ్ వ్యాగన్ లోకి వాళ్లను ఆహ్వానిస్తున్నాం.

వికీపీడియా

2001 ఆన్ లైన్ స్పేస్ లో ఇండిక్ ఇయర్ కావాలి. వన్ ఇండియా మరింత ప్రగతి పథంలో సాగడానికి మీ మద్దతు, సలహాల కోసం చూస్తున్నాను. మీకు మరింత మెరుగైన సేవలు అందించడానికి, ఆ సేవలను విస్తరించడానికి మీరిచ్చే సలహాల కోసం ఎదురు చూస్తున్నాను.

వన్ ఇండియా డాట్ ఇన్ టీమ్ తరఫున శుభాకాంక్షలతో

బిజి మహేష్

సిఇవో, వన్ ఇండియా డాట్ ఇన్

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Oneindia.in completes 5 years of operation. It was not an easy journey but was fun. I would like to share my thoughts on the journey so far. We believe in languages and feel honored to serve the language community in India, after all the non-English speaking community is the majority in India but under served on the internet. We promise to bring you better things in the coming years.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more