హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ నేతల రాజీనామాలకు చంద్రబాబు విరుగుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడి రెండు కళ్ల సిద్దాంతాన్ని ఆమోదించలేక, ఇటు తెలంగాణ ప్రజల్లోని సెంటిమెంటును కాదనలేక చివరికి రాజీనామాల బాటన పట్టిన తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులను తన దారిలోకి తెచ్చుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణపై కాస్త పట్టు విడుపు ధోరణిలో వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ టిడిపి నేతలు కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ ఆ పార్టీ అధికారికంగా ప్రకటించక పోవడంతో తెలంగాణ ప్రజల్లో ఆ పార్టీ నేతలపై అపనమ్మకం ఏర్పడింది. దీనిని ఆ పార్టీ నేతలు గమనించినప్పటికీ చంద్రబాబు తీరు మారుతుందేమోనని ఇన్నాళ్లూ వేచి చూశారు.

అయితే తెలంగాణ ఉద్యమం అంతిమ స్థాయికి చేరిన దశలో కూడా చంద్రబాబు తన రెండుకళ్ల సిద్ధాంతంపైనే నిలబడి ఉండటంతో చేసేది లేక తెలంగాణకు చెందిన టిడిపి నాయకులు రాజీనామాకు సిద్ధపడుతున్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడి తీరుకు విసిగిపోయి తెలంగాణకు కట్టుబడి ఉన్న తెరాసలో చేరే విషయం అధికారికంగా త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఆయన దారిలోనే శాసనసభ్యులు సుద్దాల దేవయ్య, వేణుగోపాల్ తదితరులు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పటి వరకు చంద్రబాబు మాటకు ఎదురు చెప్పని నేతలు తెలంగాణపై అస్పష్ట వైఖరితో ఉన్న టిడిపిని ప్రజలు నమ్మడం లేదని ఇదే విధంగా ఉంటే డిపాజిట్లు కూడా దక్కవి ఆందోళన చెందారు. కానీ తీరు మారక పోవటంతో చేసేది లేక రాజీనామాలకు తెరదీశారు. దీంతో చంద్రబాబు ఇన్నాళ్లకు తెలంగాణపై ఓ మెట్టు దిగివచ్చే దిశలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే యోచనలో ఇప్పుడు ఆ పార్టీ వారు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ టిడిపి వారికి ప్రత్యేక రాష్ట్రంపై ఎంత చిత్తశుద్ది ఉన్నప్పటికీ అధినేత నిర్ణయం వారికి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. దీంతో నాగం జనార్ధన్‌రెడ్డి తదితర నేతలు చంద్రబాబును ప్రత్యేక శాఖకు ఒప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వారు తెలంగాణ ఊబినుండి బయటపడే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఉప ఎన్నికలకు ముందు స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ధర్నాలు చేసి మహారాష్ట్ర ఆరు రోజులు జైలులో మగ్గినప్పటికీ తెలంగాణలో ఆ పార్టీ కనీసం దరావత్తు కూడా దక్కించుకోలేదు. ఇదే విషయాన్ని వారు పార్టీ చంద్రబాబుకు చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేశారని, అందుకు చంద్రబాబు సమ్మతించారని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X