కడప జిల్లాలో జగన్ వర్గంలోకి టిడిపి, కాంగ్రెసుల నుండి వలసలు

రఘురామిరెడ్డి శుక్రవారం ప్రొద్దుటూరులో తన కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారంతా జగన్ వైపు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కార్యకర్తలు కూడా జగన్ వైపై ఉన్నందున ఆయన జగన్ పార్టీలోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కాంగ్రెసు పార్టీ మాజీ శాసనసభ్యుడు వరదరాజులు రెడ్డి కూడా జగన్ పెట్టబోయే పార్టీలో చేరడానికి సిద్దమయినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఆయన భావించినట్టుగా తెలుస్తోంది. దాంతో జగన్ పార్టీలో చేరడానికి తన కార్యకర్తల అభిప్రాయాలను కూడా ఆయన తీసుకున్నారని సమాచారం.
కడప దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సొంత జిల్లా కావటంతో భారీ ఎత్తున నేతలు జగన్ పార్టీలో చేరడానికి సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో వైయస్ కుటుంబానికి మంచి పట్టు ఉంది. జిల్లాలో ఉన్న శాసనసభ్యుల్లో మంత్రులు కాకుండా ఐదుగురు ఎమ్మెల్యేలు జగన్ వెంట ఉన్నారు. ఎంవి రమణారెడ్డి ఇటీవలే జగన్ వర్గంలో చేరారు. జగన్ పార్టీ పెట్టే వరకు ఈ వలసలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. కాగా దివంగత వైయస్ సమాధిపై జగన్ పార్టీ పత్రాలను అంబటి రాంబాబు శుక్రవారం పెట్టారు.












Click it and Unblock the Notifications