అవన్నీ వట్టి పుకార్లే: మెసేజ్‌లు, కేంద్ర బలగాలపై హోంమంత్రి సబితారెడ్డి

అవన్నీ వట్టి పుకార్లు అని కొట్టి పారేశారు. యూనివర్శిటీలో ఉన్న విద్యార్థులను పోలీసులు ఏమీ అనటం లేదన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా మెస్‌లు మూసి వేశామని అయితే విద్యార్థుల కోరిక మేరకు వాటిని మళ్లీ తెరిచినట్టు చెప్పారు. దానిని రాజకీయ కోణంలో చూడవద్దన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా యూనివర్శిటీ గేట్ల దగ్గర మాత్రమే పోలీసులను మోహరించామన్నారు. అక్కడా రాష్ట్ర పోలీసులు మాత్రమే ఉన్నారని, కేంద్ర బలగాలు లేవన్నారు. యూనివర్శిటీలోకి మీడియా అనుమతి విషయమై నగర పోలీసు కమిషనర్ సాయంత్రం మీడియా అధినేతలతో మాట్లాడతారని ఆ తర్వాత అంచెలంచెలుగా అనుమతులు ఎత్తివేసే దిశలో ఆలోచిస్తామన్నారు. ఓయులో బయటి విద్యార్థులు ఉన్నారన్న విషయాన్ని విసి నిర్ధారించాలన్నారు. యూనివర్శిటీలో తెలంగాణవాదులపై దాడులు నిజం కాదన్నారు.












Click it and Unblock the Notifications