తెలంగాణ కోసం త్యాగాలు చేయడానికి సిద్ధం: కె కేశవరావు

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే తమ లక్ష్యమన్నారు. అదీ హైదరాబాదుతో కూడిన తెలంగాణ కావాలని కెకె అన్నారు. మంగళవారం జరిగే తెలంగాణ కాంగ్రెసు నేతల భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడుతామన్నారపు. రేపటి సమావేశంలో అందరూ పాల్గొంటారని చెప్పారు. సీమాంధ్రకు చెందిన నేతలు సెక్యూరిటీపై, తమ ప్రాపర్టీస్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. వారిని మేం ఒప్పిస్తామన్నారు. వారి సెక్టూరిటీకి ఎలాంటి సమస్య లేదన్నారు. తెలంగాణకు ముందు ఎలా ఉన్నారో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంతే స్వేచ్ఛ వారికి ఉంటుందని చెప్పారు. వారు మా తమ్ముళ్లలాంటి వారన్నారు. కాగా సమావేశం సికింద్రాబాదులోని కెజెఆర్ గార్డెన్సులో జరగనున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications