తెలంగాణపై పట్టు వీడని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు

తాము కాంగ్రెసుకు వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెబుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ ఇవ్వాలని తాము అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తాము సంక్రాంతి పర్వదినం తర్వాత సోనియాను కలుస్తామని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయక తప్పదని శాసనసభ్యులు శ్రీధర్, రాజయ్య అన్నారు.












Click it and Unblock the Notifications