కిరణ్ కుమార్ రెడ్డి వెనక చక్రం తిప్పుతున్న గవర్నర్ నరసింహన్

Governor Narasimhan
హైదరాబాద్‌: రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ నరసింహనే అన్ని నడిపిస్తున్నాడనే వ్యాఖ్యలు వినిపించాయి. రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదని అంటున్నారు. నరసింహనే అన్నీ నడిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రత్యేకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏముందనే వ్యాఖ్యలు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. వైయస్ జగన్ వ్యవహారం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులకు నచ్చజెప్పి దారికి తేవడానికి గవర్నర్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు.

నరసింహన్ ద్వారానే కాంగ్రెసు పార్టీ అధిష్టానం అన్నీ నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజారాజ్యం, మజ్లీస్ పార్టీల మద్దతు సంపాదించడంలో కీలక పాత్ర గవర్నర్‌దేనని అంటున్నారు. తాజాగా, కాంగ్రెసులోని వీర తెలంగాణవాదులను దారికి తెచ్చి తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టించే వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ సూచన మేరకు ముఖ్యమంత్రి పార్టీలోని వీర తెలంగాణవాదులను బుజ్జగించే ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే దామోదర్ రెడ్డితోనూ, కేశవరావుతోనూ ముఖ్యమంత్రి చర్చలు జరిపారని చెబుతున్నారు. రాష్ట్ర పరిస్థితిలను చక్కదిద్దడానికి కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా నరసింహన్‌పైనే ఆధారపడినట్లు ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+