కిరణ్ కుమార్ రెడ్డితో వీర తెలంగాణవాది కె. కేశవ రావు భేటీ

కిరణ్ కుమార్ రెడ్డి మాటలకు కేశవరావు తగ్గలేదని సమాచారం. దీంతో కేశవరావు కోపంగానే అక్కడి నుంచి వెళ్లిపోయారా అనే సందేహం కలుగుతోంది. కేశవరావు అక్కడి నుంచి మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తన సోదురుడు, మంత్రి ఆర్. వెంకటరెడ్డితో కలిసి ఆయన ముఖ్యమంత్రి వద్దకు వచ్చారు. తెలంగాణపై దామోదర్ రెడ్డి కూడా గొంతు పెంచుతున్న విషయం తెలిసిందే. తాను తెలంగాణ గురించే కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు దామోదర్ రెడ్డి చెప్పారు. పార్టీలోని వీర తెలంగాణవాదులతో కిరణ్ కుమార్ రెడ్డి విడివిడిగా మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications