శబరిమలలో ఘోర విషాదం: తొక్కిసలాటలో వంద మందికి పైగా మృతి

Sabarimalai Stampede
తిరువనంతపురం‌: దక్షిణాదిలో విశేష తీర్థయాత్ర శబరిమలలో శుక్రవారం రాత్రి ఘోర విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి జరిగిన తొక్కిసలాటలో 102 మందికి పైగా మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. శనివారం ఉదయం 9 గంటల సమయానికి 102 మృతదేహాలను వెలికి తీశారు. శబరిమల చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద ప్రమాదం. ఓ జీపు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మృత్యుఘోష వినిపించింది. కేరళలోని ఇడుక్కి జిల్లా పుల్లుమేడు వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారే. అయ్యప్ప మకరజ్యోతిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు గుర్తించిన ప్రకారం మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారున్నారు. తమిళనాడుకు చెందిన 22 మంది, కర్ణాటకకు చెందిన 14 మందిని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. గాయపడినవారిని కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన స్థలం అటవీ, కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కాస్తా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రమాదం నేపథ్యంలో కేరళ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సన్నిధానానికి అతి సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అచ్యుతానంద అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.

హెల్ప్ లైన్ 04869 - 222049

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+