వైయస్ జగన్‌పై మరోసారి కాంగ్రెసు నేత వి. హనుమంతరావు ఫైర్

V Hanumantha Rao
హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అమ్మలాంటి వదినపై చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేయాలని చూస్తున్నారని వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు తాను ఏం చేస్తున్నాడో జగన్ ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. తల్లిలాంటి కాంగ్రెసు పార్టీని తిట్టిపోసి వైయస్ జగన్ పెరుగుతానని అనుకుంటున్నాడని, జనాన్ని చూసి బలం అనుకుంటున్నారని, జగన్ బలం ఉండదని ఆయన అన్నారు.

విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చేసరికి శాసనసభ్యుల బలం 30 నుంచి 21కి తగ్గిందని, ఇంకా జగన్ బలం తగ్గుతుందని ఆయన అన్నారు. తన తల్లి విజయమ్మపై వివేకానంద రెడ్డి పోటీ చేస్తే తన తండ్రి వైయస్సార్ ఆత్మ క్షోభిస్తుందని జగన్ అంటున్నాడని, జగన్ చేసేది చూసి వైయస్ బతికి ఉన్నా చచ్చిపోయినవాడిలాగే అయ్యేవాడని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, సోనియా గాంధీని వ్యతిరేకించలేదని ఆయన గుర్తు చేశారు. ఓసారి కాంగ్రెసుకు వ్యతిరేకంగా చేసి వైయస్సార్ ఆత్మ విమర్శ చేసుకున్నారని ఆయన చెప్పారు. ఇందిరమ్మకు, హస్తం గుర్తుకు రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందని, కాంగ్రెసును జగన్ ఏమీ చేయలేడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+