ప్రణబ్ ముఖర్జీతో భేటీ కావాలని సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల నిర్ణయం

సీమాంధ్ర ఎంపిల్లో కొంత మంది సర్ది చెప్పడంతో కావూరి సాంబశివ రావు ప్రణబ్ ముఖర్జీతో సమావేశానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంపీల సమావేశం మధ్యలోనే రాయపాటి సాంబశివ రావు వెళ్లిపోయారు. తాము ప్రణబ్ ముఖర్జీతో భేటీకి హాజరవుతామని ఆయన చెప్పారు. కాగా, శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరు సిఫార్సులు కూడా బాగున్నాయని వారు సోనియాకు రాసిన లేఖలో చెప్పారు. అయితే, నివేదికలోని ఆరో ప్రత్యామ్నాయానికి కట్టుబడి పనిచేయాలని ప్రణబ్‌ను కోరాలని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications