కేంద్ర మంత్రివర్గంలో రెడ్లకే ప్రాధాన్యమా, సీమాంధ్రపై నిర్లక్ష్యమా: రాయపాటి

కేంద్ర మంత్రివర్గంలో రెడ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. 2004 నుంచి కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా సీమాంధ్ర నుంచి ఒక్కరిని కూడా నియమించలేదని, సీమాంధ్రపై కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. సీమాంధ్ర నుంచి 21 మంది పార్లమెంటు సభ్యులుంటే ఒక్క కేబినెట్ పదవి కూడా ఇవ్వరా అని ఆయన అడిగారు. రాష్ట్ర రాజకీయాలపై పార్టీ అధిష్టానానికి ఆసక్తి లేదని ఆయన అన్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తుంటే కేంద్ర, రాష్ట్ర మంత్రులు చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ స్థితిలో ఏ ముఖం పెట్టుకుని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు వెళ్తారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications