తెలంగాణపై ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్, దానికి కట్టుబడ్తాం: షకీల్

Shakeel Ahmad
న్యూఢిల్లీ: తెలంగాణపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని, ఆ నిర్ణయానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని అఖిల భారత కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి) అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయ సాధనకు సమయం పడుతుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణకు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ డిమాండ్ ఇప్పటిది కాదని, మూడు నాలుగు దశాబ్దాలుగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం పార్టీల్లో ఏకాభిప్రాయం అవసరమని ఆయన అన్నారు.

పార్టీలతో సంప్రదింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సంప్రదింపులు జరుపుతోందని ఆయన అన్నారు. ఏకాభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. అంత తొందరగా ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఆయన అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట వెళ్లినవారిపై చర్యలు తీసుకునే విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆ విషయాన్ని పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని అడగండని ఆయన సమాధానమిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+