వైయస్ జగన్ బలం తగ్గుతోందా, ఎమ్మెల్యేలు జారిపోతున్నారా?

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు శాసనసభ్యుల బలం క్రమంగా తగ్గుతోందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవం కూడా ఆ ప్రచారానికి అనుగుణంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. తమకు ప్రత్యక్షంగా 30 మంది శాసనసభ్యులు మద్దతిస్తున్నారని, లోపలి బలాన్ని చూసుకుంటే 50 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని జగన్ వర్గం చెప్పుకుంటోంది. అయితే, క్రమంగా ఆ బలం తగ్గిపోతున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ్యులతో మంతనాలు జరుపుతూ, మంత్రులను వారిని బుజ్జగించడానికి నియోగిస్తూ జగన్ వైపు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. జగన్ వైపు వెళ్లిన కొర్ల భారతి, కుంజా సత్యవతి, రేగా కాంతారావు వంటి శాసనసభ్యులను ఇప్పటికే బుజ్జగించారు. ఇతరులను బుజ్జగించే ప్రయత్నాలు సాగుతున్నారు. జగన్ వీరవిధేయులను వదిలేసి మిగతావారిపై కిరణ్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టారు.

కిరణ్ కుమార్ రెడ్డి కట్టడితో జగన్‌కు మద్దతిచ్చే శాసనసభ్యుల సంఖ్య 19కి పడిపోయిందని అంటున్నారు. జగన్ విజయవాడలో జరిగిన లక్ష్య దీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలతో తన బల పరీక్ష చేశారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) జగన్ వెంట నిలిచారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన 'జల దీక్ష'లో ఆ సంఖ్య 24గా (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) ఉంది. మొన్న పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా విశాఖపట్నంలో చేసిన జనదీక్ష 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.

బుధవారం జగన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేవలం ఎనిమిది మందే పాల్గొన్నారు. మిగిలిన వారు వేర్వేరు కారణాల రీత్యా హాజరు కాలేక పోయారని జగన్ వర్గం చెబుతోంది. అయితే బుధవారంనాడే కుంజా సత్యవతి, రేగా కాంతారావు జారిపోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన కుతూహలమ్మ, పి. రవిలను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా వైయస్ జగన్‌కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల బలం తగ్గిపోతోందని అంటున్నారు. ఈ స్థితిలోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే ప్రయత్నాలను జగన్ వర్గం చేయడం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+