జగన్‌కు ఖమ్మం ఎమ్మెల్యేల ఝలక్, ఫలించిన సిఎం కిరణ్ వ్యూహం

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్ వర్గం ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ఆయన వెంట వెళ్లడం కంటే ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకే నిర్ణయించుకునేందుకు నిర్ణయించికున్నట్లుగా కనిపిస్తోంది. బుధవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వారిని వేరువేరుగా కలిసి మాట్లాడిన విషయం తెలిసిందే. నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సూచించిన విషయం తెలిసిందే. వారు గురువారం విలేకరులతో వేరువేరుగా మాట్లాడారు. జగన్ విషయంలో తన నియోజకవర్గ కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు.

కార్యకర్తలు మనోభావాల మేరకు తాను నిర్ణయించుకుంటానని చెప్పారు. అయితే తాను ప్రస్తుతం కాంగ్రెసు పార్టీలోనే ఉన్నానని, తమ ముఖ్యమంత్రి కిరణ్ అని చెప్పారు. తన నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతమని, కాబట్టి ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సిన భాధ్యత ఉందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వానికి మరో మూడేళ్లు ఉందన్నారు. ముఖ్యమంత్రితో చర్చలో జగన్ ప్రస్తావన రాలేదని కాంతారావు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితేనే తాను జగన్ వెంట ఉంటానని భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి స్పష్టం చేశారు. అయితే జగన్‌కున్న ఆదరణ ఓర్వలేకే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+