తెలంగాణ అంశంపై బొత్స సత్యనారాయణకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలు వద్దన్నారని, తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టాకే పరీక్షలు రాస్తామన్నారని అన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించడం గర్హనీయమన్నారు. మరోవైపు తెలంగాణ కోసం చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలపై తెలంగాణ సీనియర్ నేతలు బుధవారమిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమయ్యారు. నాగంతో పాటు దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి, కడియం, హరీశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాల్లోనూ కార్యక్రమాలు చేయడం, మండలస్థాయిలో ధర్నాల్లాంటివి నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఐకాస ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలకు స్పందన లేదని, తెదేపా తెలంగాణ ఫోరం తరఫున ఆ కార్యక్రమాన్ని చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉందన్నారు.












Click it and Unblock the Notifications