కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో అడ్డంకులు: జిల్లాల బంద్‌కు పిలుపు

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పర్యటనల్లో ఆటంకాలు కల్పించడానికి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కొత్త వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి పర్యటించే తెలంగాణ జిల్లాల్లో బంద్‌కు జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. రేపటి నుంచి ఈ బంద్‌ల కార్యక్రమం అమలవుతుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

ఈ నెల 5వ తేదీన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బంద్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఈ నెల 9వ తేదీన మెదక్, వరంగల్ జిల్లాల్లో బంద్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఏ క్షణంలోనైనా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడతామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+