యెడ్యూరప్ప నగ్నంగా కటిక నేలపై పడుకున్నారా?

తన విరోధులు ప్రయోగించిన చేతబడిని నిర్వీర్యం చేసేందుకే ఆయన ఇలా చేస్తున్నారని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు వివరించాయని ఆ పత్రిక రాసింది. దానితో అయిపోలేదట. వచ్చే వారం మరో కార్యక్రమం ఉందట. పూర్తి నగ్నంగా ఓ నదిలో 12 సూర్య నమస్కారాలు చేయడం ఆ కార్యక్రమమని అంటున్నారు. ఈనెల ఎనిమిది నుంచి పదో తేదీ మధ్య ఆయన వాటిని పూర్తి చేయనున్నారట. "యడ్యూరప్పది వృశ్చిక రాశి. ఈ రాశిలోకి త్వరలోనే రాహువు ప్రవేశించనున్నాడు. దాని అర్థం.. ఆయన ప్రత్యర్థులు ఆయనకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. దీన్ని అధిగమించాలంటే నగ్నంగా సూర్య నమస్కారాలు చేయాల్సి ఉంటుంది'' అని యడ్యూరప్ప కుటుంబ పూజారి భానుప్రకాశ్ శర్మ తెలిపినట్లు ఆ పత్రిక రాసింది.
అయితే, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఈ కథనాలను ఖండించాయి. అయితే ఇప్పటికే ఎవరో తనపై చేతబడి చేశారంటూ యెడ్డి భయాందోళనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సచివాలయంలోకి అడుగు పెట్టడానికి కూడా తాను భయపడుతున్నానని సోమవారం ఆయన సంచలన ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications