వైయస్ వివేకానందరెడ్డి, వైయస్ జగన్ చీలికపై చంద్రబాబు ఆశలు

పార్లమెంటుస్థానానికి మైసూరా రెడ్డి, సీఎం రమేష్, పుత్తా నర్సింహారెడ్డి, కందుల రాజమోహన రెడ్డి, రామసుబ్బారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. మైసూరా, రమేష్‌ల పేర్లను చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఎక్కువ మంది నాయకులు ప్రస్తావించినట్లు తెలిసింది. తాను పోటీకి సిద్ధమని సీఎం రమేష్ చంద్రబాబుకు స్పష్టం చేశారు. మైసూరా మాత్రం తన ఇష్టాయిష్టాలను ఇంకా వెల్లడించలేదు. పులివెందుల శాసనసభకు గతం నుంచీ పోటీ చేస్తున్న సతీష్‌రెడ్డికి ప్రత్యామ్నాయం చూపించి, ఆ స్థానంలో మరొకరిని బరిలోకి దించే అవకాశాలున్నాయి.
సింహాద్రిపురం మండలానికి చెందిన రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి)పేరు పరిశీలనలో ఉంది. ఇన్నాళ్లూ పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసినందున తనను ఎమ్మెల్సీగా పంపించాలని, ఆ తర్వాత శాసనసభకు పోటీ చేసేందుకు సిద్ధమని సతీష్‌రెడ్డి తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం. ఇతరుల పేర్లు పరిశీలించాల్సి వస్తే స్థానిక తెదేపా నేత రవీంద్రనాథ్‌రెడ్డి వైపే పార్టీ మొగ్గుచూపే అవకాశముందని తెలుస్తోంది. మరో దఫా పార్టీ నాయకులందరితో చర్చించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 14,15 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసి అభ్యర్థులను ఖరారు చేయాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications