కాంగ్రెసు ఎంపి లగడపాటి రాజగోపాల్‌కు సుప్రీంకోర్టు నోటీసు
Districts
oi-Pratapreddy
By Pratap
విజయవాడ: కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ స్థానిక న్యాయవాది సుంకర కృష్ణమూర్తి దాఖలు చేసిన కేసులో సుప్రీం బుధవారం నోటీసు జారీ చేసింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్ ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో మూడో కుమారుని ప్రస్తావన చేసి, అతని తల్లయిన జానకీ అయ్యర్‌ను అఫిడవిట్‌లో చూపించకపోవడం చట్టవిరుద్ధమంటూ కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీం కోర్టు రాజగోపాల్‌కు నోటీసు జారీ చేసింది. దీనికి రెండు నెలల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.