చిరంజీవిపై సుప్రీంకోర్టుకు వెళతా: పార్టీ వ్యవస్థాపకుడు చెన్నకృష్ణయ్య

ప్రజారాజ్యం పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం అని ఆ రోజు తనకు చెప్పారని అందుకే తాను ప్రజారాజ్యంను చిరంజీవికి ఇచ్చానని చెప్పారు. గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టకి సుమారు 70 లక్షల మంది ఓట్లు వేశారని, రాష్ట్రంలో 15కి పైగా శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే పీఆర్పీకి వేసిన 70 లక్షల మంది ఓటర్లను అన్యాయం చేసినట్టేనని చెప్పారు. తన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసిన కారణంగా చిరంజీవిపై పీఆర్పీ వ్యవస్థాపకుడిగా సుప్రీంకోర్టుకు వెళతానని చెన్నకృష్ణయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications