పార్టీ అధ్యక్ష పదవికి ముబారక్ రాజీనామా: గద్దె దిగడానికి ససేమీరా

కాగా ఈజిప్టులో శాంతియుత మార్పు ప్రక్రియ వెంటనే ప్రారంభం కావాల్సిన అవసరాన్ని వక్కాణిస్తూ ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రపంచ నేతలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా పిలుపునిచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యువరాజు మహమ్మద్ బిన్ జాయెద్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమరూన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్‌తో ఒబామా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆందోళనకారులు కొందరిని లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆయన ఖండించినట్టుగా తెలుస్తోంది. కాగా కైరోలోని సినై వద్ద గ్యాస్ పైప్ లైన్ పేలింది. ఇది ఆందోళనకారుల పనిగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications