అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలు మారాలి: ప్రధాని

Manmohan Singh
హైదరాబాద్: చట్టాలు మారుతున్న కాలానికి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం హైదరాబాదులోని మాదాపూర్ హైటెక్స్‌లో ప్రారంభమైన కామన్వెల్తున్యాయవాద సదస్సులో అన్నారు. ఆయన ఉదయం న్యాయవాద సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. దేశంలోని సమస్యలు ఎదుర్కొనడానికి అంతర్జాతీయ నిబంధనలతో అంతర్గత న్యాయవ్యవస్థ ఉండాలని అన్నారు. ఆర్థిక సమానత్వం ద్వారానే దేశంలోని పేదరికం పోగొట్టగలమన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ సమానంగా పంపిణీ కావాలని తెలిపారు. సామాన్యుడి అభివృద్ధికే దేశ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

మానవుల గౌరవాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ కట్టుబడి ఉందనే హామీ ఉండాలని చెప్పారు. రాజ్యాంగ సూత్రాలను యథాతథంగా పాటించాలన్నదే తమ ఉద్దేమని వెల్లడించారు. ప్రపంచానికి కొత్త ఆర్థిక వ్యవస్థ కావాలన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కొత్త సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. న్యాయం, చట్టాల్లో కూడా మార్పు రావాలి సూచించారు.

సామాన్యుడి అభివృద్ధితే ప్రాధాన్యత ఉంటుందన్నారు. దారిద్రం, టెర్రరిజం, నిరక్షరాస్యత, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాతావరణ పరిస్థితులను అభివృద్ది చెందుతున్న దేశాలు ఎదుర్కొనవలసి ఉంటుందన్నారు. అభివృద్ధితోనే దారిద్ర నిర్మాలన సాధ్యం అన్నారు. ప్రభుత్వ ఫలాలు అన్ని వర్గాలకు అందాలని అన్నారు. రాజ్యాంగ సూత్రాలను అమలు పరచడమే ముఖ్యమని చెప్పారు.

కాగా కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ, గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. పది దేశాల ప్రధాన న్యాయమూర్తులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+