మెజారిటీ రాకుంటే సన్యాసం: డిఎల్‌కు జగన్ వర్గం నేత భూమా సవాల్

Bhuma Nagireddy
కడప: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత భూమా నాగిరెడ్డి మంగళవారం ఓ సవాల్ విసిరారు. డిఎల్ రవీంద్రారెడ్డి నియోజకవర్గం అయిన మైదుకూరులో వచ్చే ఉప ఎన్నికల్లో జగన్‌కు మెజారిటీ రాకుంటే నేను రాజకీయ సన్యాసం చేస్తానని భూమా సవాల్ విసిరారు. మంత్రి డిఎల్ తన సవాల్‌కు సిద్ధమేనా అని ఆయన అన్నారు. నిత్యం జగన్‌ను విమర్శిస్తున్న ఆయన నియోజకవర్గంలోనే కడప పార్లమెంటు సభ్యత్వానికి పోటీ చేయనున్న జగన్‌కు మెజారిటీ ఖచ్చితంగా వస్తుందని చెప్పారు.

కాగా మైదుకూరు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ వర్గం నేత, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపిస్తున్నారు. వైఎస్ విగ్రహాలకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వైఎస్ విగ్రహాలను అడ్డుకోవద్దని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+